తెలంగాణ ఊపిరితిత్తులుగా ఆ రెండు జిల్లాలు.. ఒక శాతం అడవి కూడా లేని జిల్లాలు ఇవే..

తెలంగాణలో జిల్లాల మధ్య అటవీ విస్తీర్ణంలో భారీ అసమానతలు ఉన్నాయి. రాష్ట్ర సగటు అటవీ ప్రాంతం 24.05 శాతంగా ఉండగా.. 71.82 శాతం అడవులతో ములుగు టాప్‌లో ఉంది. ఆ తర్వాత 60.95 శాతం అడవులతో భద్రాద్రి-కొత్తగూడెం రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు తెలంగాణకు ఊపిరితిత్తులుగా మారాయి. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత కారణంగా హైదరాబాద్, కరీంనగర్, గద్వాల జిల్లాల్లో అటవీ విస్తీర్ణం 1 శాతం కంటే తక్కువకుపడిపోయింది. కరీంనగర్‌లో అత్యల్పంగా 0.15 శాతం మాత్రమే అడవి మిగలడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.