తెలంగాణ ఎమ్మెల్యే ఫిరాయింపుల వ్యవహారం.. స్పీకర్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి.. ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కొందరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ నిర్ణయాలు వెల్లడించారని.. మరో ఇద్దరి వ్యవహారమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరగా.. స్పీకర్ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.