"దేశాలు గనుక షేర్స్ అయితే.. నేను కళ్లు మూసుకుని ఇండియానే కొంటా": యూఎస్ సెనేటర్ స్టీవ్ డైన్స్ సంచలనం

ప్రపంచంలోని దేశాలన్నీ గనుక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే కంపెనీల వంటివైతే.. తాను కళ్లు మూసుకుని భారతదేశంపైనే పెట్టుబడి పెడతానని అమెరికా సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ స్టీవ్ డైన్స్ సంచలన ప్రకటన చేశారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాప్ 20 ఆర్థిక వ్యవస్థలలో అత్యధిక జీడీపీ వృద్ధి రేటుతో ఇండియా దూసుకుపోతోందని ప్రశంసించారు. ప్రధాని మోదీతో కలిసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని చెప్పుకొచ్చారు.