పీవోకేలో పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి.. ఘాటుగా స్పందించిన భారత్

పాక్ ఆక్రమిక కశ్మీర్‌ ప్రజలు చేపట్టిన ఉద్యమం రోజు రోజుకూ మరింత తీవ్రమవుతోంది. ఆందోళనకారులపై పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యలకు పాల్పడింది. నిరసనకారులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. డజన్ల కొద్దీ గాయపడ్డారు. తాజాగా, పీఓకేలో ఆందోళనలపై భారత్ స్పందించింది. పాకిస్థాన్ దమననీతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యూఢిల్లీ.. దాయాదిని బాధ్యులుగా చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అక్కడ దశాబ్దాలుగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించింది.