kumaram bheem asifabad- క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి

ఇందిరమ్మ ఇళ్ల్ల పథకంలో ఎల్-1 జాబితాలో ఉన్న కచ్చ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా నివేదిక అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్లో గృహనిర్మాణశాఖ, ఎంపీడీవోలతో ఎల్-1 జాబితాలోని కచ్చ ఇళ్లు గల లబ్ధిదారుల జాబితా పరిశీలన మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత కొరకు ఎల్-1 జాబితాలో గల కచ్చ ఇళ్లు గల లబ్ధిదారుల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులపై విచారణ జరిపి నివేదికలు వెంటనే అందించాలని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే గృహనిర్మాణశాఖ పీడీ దృష్టికి తీసుకురావాలని ఎల్-1 జాబితాలో కచ్చ ఇళ్లుగా నమోదైన లబ్ధిదారుల వివరాల సంఖ్య 2,300 ఉందని చెప్పారు. అందులో ఇప్పటి వరకు 1,800 ఇళ్లు పరిశీలన పూర్తి చేశామని వివరించారు.