బెంగాల్‌లో ప్రకృతి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో ఉత్తర బెంగాల్ జిల్లాల నుంచి సిక్కింకు రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. డార్జిలింగ్‌లో పర్యటక ప్రాంతాలన్ని మూసేశారు. భారీ వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని బీజేపీ ఎంపీ రాజు బిస్తా ఆవేదన వ్యక్తం చేశారు.