‘మేనమామ ఉంగరం’ పథకం.. పుట్టిన బిడ్డకు గ్రాము గోల్డ్ రింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం

తమిళనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నటుడు జోసెఫ్ విజయ్ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే ఉచిత విద్యుత్, మహిళా దళం ఏర్పాటు వంటి పథకాల అమలు ఫైళ్లపై సంతకాలు చేశారు. తర్వాత రైతు రుణమాఫీని కూడా అమలు చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇది తన పుట్టిన రోజైన జూన్ 22 నుంచే అమల్లోకి వచ్చింది.