మా అధీనంలోనే హర్మూజ్.. నౌకలు దాటాలంటే 20 శాతం ఫీజు కట్టాల్సిందే.. ట్రంప్ సంచలన ప్రకటన

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది మొదలు.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ దాడులకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత నెలలో ఒప్పందం కుదిరినప్పటికీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో హర్మూజ్ జల సంధిని తాము స్వాధీనం చేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు.