మా వాళ్లు గుణవంతులు, వాళ్లు ధన వంతులు...బోత్ ఆర్ నాట్ సేమ్: కేంద్రమంత్రి బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తాచాటాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని బీజేపీ హామీల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ కార్పొరేషన్లో కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదల్లా నిధులు తెచ్చే బాధ్యత తీసుకు వస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను గెలిపిస్తే మీ ఇండ్లలోకి వరద నీళ్లు వస్తాయే తప్ప అభివృద్ధి జరగదని అన్నారు.‘బీజేపీ పక్షాన పోటీ చేసే అభ్యర్థులు గుణవంతులైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ధనవంతులు. మా వాళ్లు (బీజేపీ)మీ సమస్యలపై పోరాటం చేసి జైలుకు పోతే, ఆ పార్టీల నాయకులు కబ్జాలు, దోపిడీలు చేసి జైలు కెళ్లారు. బోత్ ఆర్ నాట్ సేమ్’అంటూ తనదైన సినిమా స్టైల్లో చెప్పుకొచ్చారు., News News, Times Now Telugu