రిటైర్మెంట్ రోజే సీబీఐ చిక్కిన ఐఏఎస్ అధికారి.. రూ. 169 కోట్ల స్కామ్‌లో అరెస్ట్!

రిటైర్మెంట్ రోజే ఓ ఐఏఎస్ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. హర్యానాలో ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన కేసులో ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో అరెస్టు చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది. హర్యానా కాలుష్య నియంత్రణ మండలిలో సెక్రటరీగా పనిచేసిన సమయంలో ప్రదీప్ కుమార్ రూ. 169 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలతోనే అరెస్టు చేశారు.