రైతులకు తీపి కబురు.. నేడు అకౌంట్లలోకి డబ్బులు.. తొలి విడతలో వీరికి మాత్రమే

తెలంగాణలో వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. తొలి విడతలో భాగంగా రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం శిల్పకళా వేదిక నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మం సభ హైదరాబాద్‌కు మారింది. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లను దశలవారీగా అందించనున్నారు. ఈ నిధులను బ్యాంకులు పాత రుణాల కింద మినహాయించుకోకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.