రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు: ట్రంప్ సంచలనం

రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లోనే ఈ యుద్ధంలో దాదాపు 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించిన ఆయన.. ఈ రక్తపాతం వెంటనే ఆగిపోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పోరాటాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంది. అందరూ ఆటలు ఆడటం మానేయాలి అని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ ప్రతిపాదించిన 28-సూత్రాల శాంతి ప్రణాళికలో డాన్‌బాస్ ప్రాంతాన్ని వదులుకోవాలనే అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. 20-పాయింట్లతో కూడిన తమ కొత్త ప్రణాళికను అమెరికాకు అందించారు.