లడఖ్ పాంగాంగ్ సరస్సు వద్ద పర్యాటకుల ఓవరాక్షన్.. రూ.2 లక్షల జరిమానా వేసిన అధికారులు!

లడఖ్ అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులు రీల్స్ పిచ్చితో చేసే విన్యాసాలకు అక్కడి యంత్రాంగం గట్టి బ్రేక్ వేసింది. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన పాంగాంగ్ సరస్సుతో పాటు రక్షిత వన్యప్రాణి క్షేత్రాల్లోకి అక్రమంగా కార్లను పోనిచ్చి స్టంట్లు చేసిన నలుగురు పర్యాటకులకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రూ. 50,000 చొప్పున మొత్తం 2 లక్షల రూపాయల భారీ జరిమానా విధించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా స్పందించిన అధికారులు పంజాబ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన థార్, ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ వాహనాలను సీజ్ చేశారు.