వాజ్‌పేయి లాంటి గొప్ప వ్యక్తులతో రాజకీయం చేశా...నేడు చిల్లర వ్యక్తులతో చేయాల్సి వస్తోంది: సీఎం చంద్రబాబు నాయుడు

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ ప్రవేశపెట్టిన సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి వాజ్ పేయి సుపరిపాలన పరిచయం చేశారని కొనియాడారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.‘వాజ్‌పేయి సంస్కరణలే దేశాభివృద్ధికి కేంద్ర బిందువు. భారతీయుల గుండెల్లో వాజ్‌పేయి చిరస్థాయిగా నిలుస్తారు. ఎన్టీఆర్, వాజ్‌పేయి ఎప్పుడూ గుర్తుండేలా స్మృతీవనాల అభివృద్ధి. సంపద సృష్టి పీపీపీ ద్వారానే సాధ్యమని 30 ఏళ్లుగా నిరూపితం. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే జైల్లో వేస్తామనే వారిని ఏమనాలి.?’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు., News News, Times Now Telugu