12 ఏళ్ల ఎదురుచూపుకు ఎట్టకేలకు మోక్షం.. తెలంగాణకు రానున్న 891 మంది AP ఉద్యోగులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన అనంతరం పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలో పనిచేస్తున్న 891 మంది ఉద్యోగులు తెలంగాణకు శాశ్వత బదిలీ కోరుతూ సుముఖత వ్యక్తం చేయగా, వారి జాబితాను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు పంపించింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపితే దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రస్థాయి కార్యాలయాల ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది..