20 ఏళ్లు.. 128 మంది సాక్షుల విచారణ తర్వాత... నింబాల్కర్ హత్య కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల

మహారాష్ట్ర రాజకీయాలను ఇరవై ఏళ్లపాటు కుదిపేసిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ జంట హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ హైప్రొఫైల్ కాంట్రాక్ట్ కిల్లింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ హోంమంత్రి పద్మసింహ పాటిల్‌తో పాటు మరో ఎనిమిది మందిని ముంబై ప్రత్యేక సీబీఐ కోర్టు శనివారం నిర్దోషులుగా విడుదల చేసింది. 2006 నాటి ఈ సంచలన కేసులో సుదీర్ఘ కాలం పాటు దర్యాప్తు సాగించిన సీబీఐ.. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచలేకపోవడం వల్లే ఈ తీర్పు వచ్చింది.