36 గంటల్లో 80 డ్రోన్లు.. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసం: ఆపరేషన్ సిందూర్ దాడులను ఒప్పుకున్న పాక్

మేము దాడులు చేస్తే శబ్దం రాదు.. కేవలం శవాల కుప్పలే కనిపిస్తాయి అన్న రీతిలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రభావాన్ని పాకిస్థాన్ ఎట్టకేలకు బాహాటంగా అంగీకరించింది. రావల్పిండిలోని అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భారత డ్రోన్ల దాడిలో ధ్వంసమైందని, తమ సైనికులు తీవ్రంగా గాయపడ్డారని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. కేవలం 36 గంటల్లో 80 డ్రోన్లతో భారత్ సృష్టించిన విధ్వంసం తమను ఉక్కిరిబిక్కిరి చేసిందని ఆయన వాపోయారు. గతంలో ఏమీ జరగలేదని బుకాయించిన పాక్.. ఇప్పుడు శాటిలైట్ ఆధారాలతో సహా దాడుల తీవ్రత బయటపడటంతో తలవంచక తప్పలేదు.