3డీ డిజిటల్ ట్విన్ సిటీగా హైదరాబాద్.. రియల్ టైమ్‌లో నగరమంతా కళ్లముందుకు..!

హైదరాబాద్ మహానగరాన్ని అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడానికి హెచ్ఎండీఏ కసరత్తు ప్రారంభించింది. భాగ్యనగరాన్ని పూర్తిస్థాయి 3డీ ‘డిజిటల్ ట్విన్ సిటీ’గా మార్చే ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచి ప్రత్యేక ఏజెన్సీని ఎంపిక చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని భవనాలు, రహదారులు, పార్కులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రజా స్థలాలు వంటి భౌతిక నిర్మాణాలన్నింటినీ త్రీడీ రూపంలో రియల్ టైమ్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది.