kumaram bheem asifabad- అటవీశాఖ కార్యాలయం ఎదుట పోడు రైతుల ధర్నా

జిల్లాలో పోడు భూముల సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం పోడు రైతులు భారీ ధర్నా నిర్వహించారు. రైతులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొని రైతులతో కలిసి నినాదాలు చేశారు. మా భూములు మాకే కావాలని, మేము చనిపోయినా సరే మా భూమిలోనే చస్తామని, మేము రైతులం, దేశానికి అన్నం పెట్టే రైతులం, మా భూములను లాక్కోవడం కంటే మమ్మల్ని అందరిని ఇక్కడే చెట్లకు ఉరి తీయండి అంటూ నినాదాలు చేశారు.