జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ప్రజానీకానికి ఆరో గ్యం ఇంకా అందని భాగ్యంగానే మిగిలి పోయింది. ఆసిఫాబాద్ ఏజెన్సీలో వైద్య పరంగా మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు జరుగుతాయని ఆశించినా అది ఆచరణకు నోచుకోలేదు. ముఖ్యంగా ఏటా ఏజెన్సీని చుట్టు ముట్టే అంటువ్యాధులు, విష జ్వరాలు షరామామూలుగా ఈ ఏడాది కూడా జిల్లాను పీడించాయి. జిల్లాలో గిరిజన మహిళలు రోగనిరోధక శక్తిని కోల్పోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫలితంగా ఎంతో మంది గర్భిణులు పురిటి సమస్యలను ఎదుర్కొంటు ప్రసవ వేధనకు గురైతున్నారు.