UP: ఇన్‌స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్‌చేస్తే..

UP: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. చాలా మందికి కాలక్షేపంగా మారింది. కానీ, అదే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యూపీలో ఒక విచిత్రమైన ఉదంతానికి దారితీశాయి. లైక్‌లు కొట్టుకోవడంతో మొదలైన పరిచయం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి, ఓ 14 ఏళ్ల మైనర్ బాలుడి ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మహారాజ్‌గంజ్ జిల్లాలోని నౌతన్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గోరఖ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల ఓ మహిళకి, చెన్నైలో తన తండ్రితో కలిసి ఉంటున్న 14 ఏళ్ల బాలుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకరి రీల్స్‌ను ఒకరు లైక్ చేసుకుంటూ, కామెంట్లు పెట్టుకుంటూ మొదలైన ఈ సోషల్ మీడియా స్నేహం కాస్తా, కాలక్రమేణా ప్రేమగా మారింది. ఆ బాలుడు తన పెద్ద కొడుకు కంటే ఐదేళ్లు చిన్నవాడనే విషయాన్ని సైతం ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఆ మైనర్ బాలుడు తనను పెళ్లి చేసుకున్నాడని, కానీ ఇప్పుడు తనతో కలిసి ఉండటానికి నిరాకరిస్తూ మొహం చాటేస్తున్నాడంటూ సదరు మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.