అడవి జింకకు పోహా, సాంబార్ తినిపించి అడ్డంగా బుక్కయిన ఫారెస్ట్ ఆఫీసర్.. సస్పెండ్ చేసిన సర్కారు!

అడవి జంతువుల సంరక్షణ నియమాలను తుంగలో తొక్కిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఉన్నతాధికారికి ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పింది. సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఒక అడవి జింకకు మానవ ఆహారమైన పోహా, సాంబార్ తినిపిస్తూ.. దాన్ని పెంపుడు జంతువులా నిమురుతూ కాలక్షేపం చేసిన ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ వర్మను అటవీ శాఖ తక్షణమే సస్పెండ్ చేసింది. వన్యప్రాణుల సహజ సిద్ధమైన జీవన శైలిని దెబ్బతీసేలా అధికారి ప్రవర్తించిన తీరుపై వన్యప్రాణి సంరక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.