అత్తగారింటికి 'అప్పగింతల'తో వెళ్లిన వరుడు.. బోరున విలపించిన యువకుడు!

పెళ్లిలో అమ్మాయిని అప్పగించేటప్పుడు అక్కడున్నవారు భావోద్వేగానికి గురవుతారు. కానీ, ఇల్లరికం వెళ్తున్న ఓ యువకుడు.. తన తల్లిదండ్రులు, సోదరులను వదిలి వెళ్తూ బోరున విలపించాడు. ఈ ఘటన ఛత్తస్‌గఢ్‌లో జరిగింది. వివాహం రోజున వధువు ఊరేగింపుగా వరుడి ఇంటికి వెళ్లింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు తన కుటుంబానికి వీడ్కోలు పలికాడు. ఈ సమయంలో వధువుల మాదిరిగానే అతడు కూడా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఆ వీడ్కోలు భావోద్వేగభరితంగా మారింది.