"ఆ పరిధి దాటి తీర్పు ఇచ్చారు": మద్రాస్ హైకోర్టు గోవధ నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీఎం విజయ్

తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది. కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న 1958 నాటి జంతు సంరక్షణ చట్ట నిబంధనలను పక్కనబెట్టి.. కోర్టు తన పరిధిని దాటి ఈ పూర్తి స్థాయి నిషేధ ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. దీని వల్ల ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.