'ఆగేది లేదు.. 30 రోజుల్లోనే మళ్లీ': వైట్‌హౌస్ విందుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ విందు కాల్పుల కలకలంతో అర్థాంతరంగా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ సహా మెలానియాను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. దాడులు జరిగినా ఏమాత్రం వెనక్కి తగ్గని ట్రంప్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. షో మస్ట్ గో ఆన్ అంటూ కేవలం 30 రోజుల్లోనే మళ్లీ అదే వేదికపై అందరినీ కలుస్తానని ప్రకటించారు. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తేమీ కాదు అని సీక్రెట్ సర్వీస్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తుంటే.. వైట్ హౌస్ డిన్నర్ రెండో అంకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.