వాషింగ్టన్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. తృటిలో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మరోసారి దాడి జరిగింది. వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో నిర్వహించిన.. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడ.. డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మెలానియాతోపాటు వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్‌, డిఫెన్స్ మినిస్టర్ పీట్‌ హెక్సెత్‌, మార్కో రుబియో కూడా ఉన్నారు. అయితే, కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను వెంటనే అక్కడి నుంచి తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, నిందితుడిని 31 ఏళ్ల కోలో టామోస్‌ అలెన్‌ అనే టీచర్‌గా గుర్తించారు. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్‌ ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది. ఇప్పటికే లాఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెంట్స్‌ అతడి అపార్ట్‌మెంట్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ట్రంప్‌పై దాడి జరగడంతో ఇదేమీ కొత్తకాదు.. గతంలో పలుమార్లు చావు నుంచి తృటిలో తప్పించుకున్నారు.