ఆరావళి వివాదంపై మళ్లీ సుప్రీంకోర్టుకు.. సీజేఐ, రాష్ట్రపతికి ఉద్యమకారుడు లేఖ

ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌కు కేంద్రం అనుమతులు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు సేవ్ ఆరావళి పేరుతో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలైంది. ఉత్తరాది పర్యావరణానికి ఓ కవచంలా ఉన్న ఈ ఆరావళి విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఓ తీర్పు ఇచ్చింది. తాజాగా, జీవవైవిధ్యం దెబ్బతింటుందనే ఆందోళనలతో పర్యావరణ ఉద్యమకారుడు హితేంద్ర గాంధీ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్థానిక భూభాగం కంటే 100 మీటర్లు ఎత్తులో ఉన్న భూస్వరూపాలను మాత్రమే ఆరావళిగా పరిగణించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు.