Telangana: ప్రాజెక్టుల నిర్లక్ష్యం..ఎవరి పాపం... ఎవరి లోపం?

బాస్ ఈజ్ బ్యాక్.. ఈ డైలాగే వినిపిస్తోంది బీఆర్ఎస్ క్యాడర్ నిండా. 'సమయం లేదు మిత్రమా.. సమరం కోసం సిద్ధం' అంటూ ఏ చర్చకైనా సై అంటోంది కాంగ్రెస్. మొత్తంగా ఐదు అంశాలపై 'నువ్వా-నేనా' అని మాటల యుద్ధం చేస్తున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఒకటి డీపీఆర్ మ్యాటర్.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరి హయాంలో కేంద్రం నుంచి వాపస్ వచ్చిందనేది మొదటి అంశం. ఇక రెండోది.. ఏపీతో అంటకాగి నీళ్లను అప్పగించారనే వాదన. జగన్‌తో వాటాలు పంచుకున్నది కేసీఆరే కదా అని కాంగ్రెస్... చంద్రబాబుతో కలిసి నీళ్లను ఆంధ్రాకు వదులుతున్నారని బీఆర్ఎస్ వాదించుకుంటున్నాయి. ఇక మూడో అంశం.. ఆయకట్టుకు ఎవరెన్ని నీళ్లిచ్చారని. కాళేశ్వరంతో ఎకరం కూడా తడవలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. 17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన విషయం నిరూపిస్తామంటోంది బీఆర్ఎస్. ఇక నాలుగో అంశం.. ఎవరి హయాంలో ఎక్కువ పంట పండింది? ధాన్యం ఉత్పత్తిలో రికార్డులు సృష్టించిందే కాంగ్రెస్ హయాంలో అని అధికార పార్టీ అంటుంటే.. అసలు దానికి ఆజ్యం పోసిందే కేసీఆర్ హయాంలో అని ప్రతిపక్షం కౌంటర్ ఇస్తోంది. ఇక ఐదోది.. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న అంశం. కేసీఆర్ ప్రెస్‌మీట్ గానీ.. కౌంటర్‌గా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్, అటు బీజేపీ నాయకులు ఇచ్చిన సమాధానాలు గానీ ఈ ఐదు అంశాల చుట్టూనే తిరిగాయి. ఇంతకీ.. నీటి వాటాల లెక్కల్లో వాస్తవాలేంటి? ఎవరి హయాంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం జరిగింది? ప్రతిపక్షం ఆరోపణలేంటి, అధికార పార్టీ సమాధానమేంటి?