ఇరాన్ మీద ఆంక్షల పునరుద్ధరణ.. అణు ప్రయోగాల నేపథ్యంలో ఐరాస కీలక నిర్ణయం

ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడిని తీవ్రతరం చేస్తూ.. ఐక్యరాజ్య సమితి తిరిగి ఆంక్షలను విధించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి రావడంతో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఇరాన్ మరింత సంక్షోభంలోకి జారుకుంది. ఆంక్షలను నిలిపి వేయడానికి ఇరాన్ చేసిన చివరి నిమిషం దౌత్య ప్రయత్నాలు ఫలించలేదు. జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఆరోపించడంతో ఈ స్నాప్‌బ్యాక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.