ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేరు...అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం : సీఎం చంద్రబాబు నాయుడు

ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలను అమరావతికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిని ఎవరూ కదపలేరని, నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని, అది తెలియని వారు రాజకీయాల్లో ఉండటం బాధాకరమని అన్నారు. సిద్దార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ....ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థలకు మనస్పూర్తిగా అభినందనలు తెలపుతున్నాను. సిద్దార్థ అకాడమీ సిల్వర్ , గోల్డెన్ జూబ్లీ వేడుకలు రెండిటికీ హాజరవడం సంతోషంగా ఉంది. క్రమశిక్షణ, విలువలకు ప్రాధాన్యత ఇచ్చి లక్షలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. విజయవాడను విద్యలవాడ చేయడంతో సిద్దార్థ అకాడమీ ముఖ్య భూమిక పోషించింది. విజయవాడ పేరు చెప్పగానే చదువుల సరస్వతి కొలువైన ప్రాంతం అనిపిస్తుంది. దేశంలో ఎక్కడెక్కడ నుంచో చదువుకోవడానికి విజయవాడ వస్తుంటారు. ఐఐటీ, జేఈఈ, నీట్, లాసెట్ సహా ఏ జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంక్ రావాలన్నా విజయవాడలో చదవాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు., News News, Times Now Telugu