ఏపీలో కొత్తగా ఆరు వరుసల రహదారి.. ఆ రూట్లోనే.. హైదరాబాద్‌కు మరింత వేగంగా.. దూసుకెళ్లిపోవచ్చు..

రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం సహకారంతో పలు జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇక అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదించింది. ఈ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే అమరావతి ఓఆర్ఆర్‌ను వెస్ట్ బైపాస్‌ను అనుసంధానిస్తూ 17.5 కిలోమీటర్ల మేరకు ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు చెప్తున్నారు.