ఐదు టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ఐదు టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. తిరుపతి విజిలెన్స్‌ ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తెలిపిన వివరాల మేరకు.. విశ్వసనీయ సమాచారంతో నారాయణవనం పడివేటమ్మ ఎస్టీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. నెంబరు లేని లగేజీ వాహనంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన ఐదు టన్నుల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. వాహనంతోపాటు రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుని, నారాయణవనం కీళగరం బీసీ కాలనీకి చెందిన పెరుమాల్‌ (42), రాజా (55)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై తదుపరి చర్యల నిమిత్తం వారిని నారాయణవనం పోలీసులకు అప్పగించారు.