కాంగ్రెస్ దిగ్గజం, మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్ పట్టణంలో తన స్వగృహం దేవ్‌ఘర్లో కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు కాగా.. అనారోగ్యంతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికై.. 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ స్పీకర్‌గా, 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా పని చేసిన పాటిల్ మరణం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.