జగన్ గురువు కేసీఆర్.... రాయలసీమపై వైసీపీవి దొంగ దీక్షలు: టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

రాయలసీమకు గత ఐదేళ్ల ద్రోహం చేసి నేడు... రాయలసీమ వైసీపీ నాయకులు నీళ్ల డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి హయాంలో రాయలసీమ లిప్ట్ పథకాన్ని ఎన్జీటీ నిలుపుదల చేస్తే నాలుగేళ్లు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులు పోతిరెడ్డిపాడుకు పోయి ఏం చెబుతారు రాయలసీమ లిప్ట్ ఆపింది జగన్ పాలనలోనే అని చెబుతారా? రాయలసీమలో 49 ఎమ్మెల్యే, 8 ఎంపీలు ఇస్తే... జగన్ రెడ్డి సీమకు చేసింది గుండు సున్నా. జగన్ రెడ్డి కుటుంబం రాయలసీమకు ద్రోహం చేస్తే... చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఈ 19 నెలల పాలనలోనే రూ.8 వేల కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. హంద్రీనీవాను రూ.3870 కోట్లు ఖర్చు చేసి 738 దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకెళ్లాం. 190 రోజుల్లో హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీలు తరలించాం. రాయలసీమలోని ప్రతి జిల్లాకు కృష్ణా జలాలను అందించాం అని టీటీడీ పొలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు., News News, Times Now Telugu