జైల్లో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి దారుణం, ఏకాంత నిర్బంధాన్ని ఎత్తివేయాలి: పాక్‌కు ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో.. ఖాన్‌కు అందుతున్న చికిత్స అమానవీయంగా, హిసించడానికి సమానంగా ఉందని UN మానవ హక్కుల నిపుణురాలు, స్పెషల్ రాపోర్టెర్ ఆలిస్ జిల్ ఎడ్వర్డ్స్ సంచలన ప్రకటన చేశారు. రోజుకు 23 గంటల పాటు ఒంటరి సెల్‌లో ఉంచడం, కీటకాలు ఉన్న చిన్న గదిలో నిర్బంధించడం, సరైన వైద్య సంరక్షణ నిరాకరించడం వంటి చర్యలు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. ఏకాంత నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఎడ్వర్డ్స్ డిమాండ్ చేశారు.