టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 15 మంది మృతి, పలువురికి గాయాలు

సరదాగా విహారయాత్రకు వెళ్లిన వారి సంతోషం ఆవిరైంది. కొండ చరియలు విరిగిపడటంతో టూరిస్ట్ బస్సులో ఉన్న 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడగా.. శిథిలాల కింద ఇంకొందరు చిక్కుకుపోయారు. బల్లు వంతెన సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. బస్సులో 30 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.