తెలంగాణపై నిప్పుల వర్షం.. 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, మరో 4 రోజులు జాగ్రత్త

తెలంగాణలో భానుడి ఉగ్రరూపానికి వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. శుక్రవారం రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడదెబ్బకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. గాలిలో తేమ తగ్గడం వల్ల పగలే కాకుండా రాత్రి వేళల్లోనూ సెగలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 244 మండలాలు ఎండలతో అల్లాడిపోతుండగా.. వాతావరణ శాఖ రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకమని హెచ్చరిస్తూ 18 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని అత్యవసర సూచనలు జారీ చేసింది.