దుబ్బాకలో భారీ చోరీ..కిలోన్నర బంగారం, రూ.8 లక్షలు అపహరణ
తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కిలోన్నర బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, రూ.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.