అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైనిక క్యాంపులు? రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ.. అసలు నిజం ఏంటంటే?

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీఎల్ఏ (పీఎల్ఏ) చొరబాట్లకు పాల్పడి, భారత భూభాగంలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందనే వార్తలను భారత సైన్యం తీవ్రంగా ఖండించింది. మీడియాలో వస్తున్న ఈ కథనాలన్నీ ముమ్మాటికీ అవాస్తవమని.. పూర్తిగా ఆధార రహితమైనవని సోమవారం స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్లోని తక్సింగ్ ప్రాంతంలో ఐదు చోట్ల చైనా బలగాలు రోడ్లు, క్యాంపులు నిర్మించాయంటూ స్థానిక నా వెల్ఫేర్ సొసైటీ జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన మెమోరాండం ఆధారంగా ఈ వార్తలు వచ్చాయి.