"హోటల్ నుంచే అదుపులోకి..": అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తుండగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్

అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం యూపీలో తీవ్ర రాజకీయ రచ్చకు దారితీసింది. రామ్ లల్లా దర్శనం కోసం కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో కలిసి అయోధ్య చేరుకున్న యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను పోలీసులు హోటల్ గది నుంచే నాటకీయంగా అరెస్ట్ చేశారు. ఈ చర్యపై తీవ్రంగా మండిపడ్డ అజయ్ రాయ్.. రామాలయ చందాలు, భూ కుంభకోణాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం చందాలను దోచేస్తున్న దొంగ అని అభివర్ణించారు. అలాగే రామభక్తులను చూసి తీవ్రంగా భయపడుతోందని ధ్వజమెత్తారు.