"నా కొడుకు చాలా దూరంగా నిలబడ్డాడు.. సియానే ఇరికిస్తోంది": నిందితుడు చేతన్‌ తండ్రి

పూణే లోహ్‌గఢ్ కోట మర్డర్ మిస్టరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు చేతన్ చౌదరి తండ్రి బాబూలాల్ చౌదరి తన కొడుకును వెనకేసుకొచ్చారు. తన కుమారుడు పూర్తిగా నిరపరాధి అని, సహ నిందితురాలు సియా గోయల్ తనను తాను కాపాడుకోవడానికి చేతన్‌ను ఈ కేసులో దారుణంగా ఇరికించిందని ఆయన ఆరోపించారు. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను 400 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి నెట్టి చంపిన ఉదంతంలో పోలీసులు ఇప్పటికే సియా, చేతన్‌లను అరెస్ట్ చేయగా.. జూన్ 18న కోటపై ఎండ ఎక్కువగా ఉన్నా చేతన్ హుడీ ధరించడం, సియాను వెంబడిస్తూ సైగలతో మాట్లాడడం వంటివి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే వీటిని చూపిస్తున్న పోలీసులు వీరిద్దరూ కలిసే హత్య చేశారని గట్టిగా వాదిస్తున్నారు.