న్యాయమూర్తిపైనే ఆరోపణలు.. విచారణలో వివక్ష చూపారంటూ ఢిల్లీ కోర్టు సంచలన నోటీస్!

న్యాయం నిష్పాక్షికంగా జరగాలనే ప్రాథమిక సూత్రానికే విఘాతం కలిగిస్తోందంటూ.. స్వయంగా ఒక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీరుపై ఢిల్లీ జిల్లా కోర్టు తీవ్రంగా స్పందించింది. నిందితులకు కనీస సమన్లు జారీ చేసే ప్రక్రియ కూడా పూర్తి కాకుండానే అసాధారణ తొందరపాటుతో నోటీసులు ఇచ్చారన్న ఆరోపణలు న్యాయవర్గాల్లో తీవ్ర సంచలనం రేపాయి. ఒకే వ్యాపారవేత్తకు సంబంధించిన కేసులు వరుసగా ఒకే కోర్టులో లిస్ట్ అవ్వడం వెనుక పక్షపాత వైఖరి ఉందంటూ నిందితులు దాఖలు చేసిన బదిలీ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఢిల్లీ సెషన్స్ కోర్టు.. సదరు మేజిస్ట్రేట్ విచారణలపై స్టే విధించారు.