పుతిన్ మరో ఐరోపా దేశంపై దాడికి సిద్ధమవుతున్నారు: జెలెన్స్కీ సంచలనం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన యుద్ధ వ్యూహాన్ని ఉక్రెయిన్ దాటి విస్తరించడానికి సిద్ధం అవుతున్నారని.. మరో ఐరోపా దేశంపై కూడా దాడికి కుట్ర పన్నుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన హెచ్చరికలు చేశారు. ఐరోపా గగనతలంలో రష్యా పదేపదే డ్రోన్లను ప్రవేశ పెడుతూ.. నాటో దేశాల రక్షణ సామర్థ్యాన్ని పరీక్షిస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. ఇటీవల న్యూయార్క్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన సమావేశం తర్వాత కీవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా తదుపరి లక్ష్యం ఏ దేశమో ఎవరికీ తెలియదని, కానీ యుద్ధం ఇక్కడితో ఆగదని ఆయన స్పష్టం చేశారు.