పవిత్రమైన వారణాసి గంగానదిలో పడవపై చికెన్, బీర్ పార్టీ.. వీడియో వైరల్, ఐదుగురు అరెస్టు

గంగానదిలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద పడవపై కొందరు యువకులు చికెన్ వండుతూ, బీర్ తాగుతూ ఎంజాయ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎనిమిది మంది యువకులు చిల్ అవుతూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేశారు. వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై వెంటనే స్పందించారు. అందులో ఐదుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ముగ్గురి కోసం వెతుకుతున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ స్థలంలో ఇలా జరగడం దురదృష్టకరమని కొందరు అంటున్నారు.