బిహార్‌లో బీజేపీ వ్యూహం.. ఫేమస్ సింగర్‌ను బరిలోకి దింపుతున్న కమలదళం..!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బిహార్‌లో రాజకీయాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్.. బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె దర్భంగాలోని అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మైథిలి.. కేంద్ర మంత్రి, బీజేపీ ఎలక్షన్ ఇంఛార్జీని కలిసిన తర్వాత.. ఈ ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నేత వినోద్ తావ్డే ట్వీట్‌ కూడా ప్రచారానికి బలం చేకూర్చుతోంది.