"భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు".. మోదీ, షరీఫ్‌‌లకు ఇరు దేశాల ప్రముఖుల పిలుపు!

ఆపరేషన్ సిందూర్ జరిగి సంవత్సరం పూర్తయింది. పహల్గాం ఉగ్రదాడితో మొదలైన అగ్ని జ్వాలలు భారత్ - పాక్ మధ్య ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నం చేయాలని ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ మేరకు భారత్ - పాకిస్థాన్‌కు చెందిన 117 మంది ప్రముఖులు ప్రధాని మోదీ, షెహబాజ్ షరీఫ్‌లకు బహిరంగ లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలని కోరారు.