మా వద్ద వెయ్యిమంది సూసైడ్ బాంబర్లు.. భారత్‌కు మసూద్ అజర్ ఉగ్ర హెచ్చరికలు, ఆడియో వైరల్

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ తాజాగా మరోసారి భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశాడు. తన వద్ద వెయ్యి మందికి పైగా సూసైడ్ బాంబర్లు ఉన్నారని పేర్కొన్నాడు. వారు ఏ క్షణమైనా భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మసూజ్ అజార్‌కు సంబంధించిన కొత్త ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి, దానికి ప్రతిగా భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారత భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి.