రాంగ్ రూట్‌లో వచ్చిన వ్యక్తికి చుక్కలు చూపించిన కేరళ బామ్మ.. వీడియో వైరల్!

తప్పు చేసిన వారిని ప్రశ్నించడానికి చిన్నా పెద్దా అనే తేడా ఉండదని.. ఎవరైనా న్యాయం వైపు నిలబడితే అన్యాయం చేసినవాడు తప్పు తెలుసుకుని దారిలోకి రావాల్సిందేనని నిరూపించారో బామ్మ. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో వచ్చి పాదచారులను ఇబ్బంది పెట్టిన ఓ వాహనదారుడికి.. ఆమె తనదైన శైలిలో చుక్కలు చూపించారు. నువ్వు రాంగ్ రూట్‌లో వచ్చావు.. వెనక్కి వెళ్లాల్సిందే అంటూ ఆయన వాహనానికి ఎదురుగా నిల్చున్నారు. ముందుకు వెళ్లనీయకుండా కాళ్లు అడ్డం పెడుతూ అతడిని నిలదీయగా.. చేసేదేమీ లేక అతడు వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.