వైద్యులే లక్ష్యంగా సైబర్ మాయాజాలం.. రూ.29.8 కోట్లు నష్టపోయిన వందలాది మంది డాక్టర్లు.. వెలుగులోకి...

నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాల్చుతున్నాయి. నిరక్షరాస్యులు, సామాన్యులే కాకుండా సమాజంలో అత్యంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న విద్యావంతులను సైతం సైబర్ నేరగాళ్లు చాకచక్యంగా బురిడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతం సైబర్ ముఠాల టార్గెట్ వైద్యులుగా మారినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సంచలన విషయాలను వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 735 మంది వైద్యులు సైబర్ మోసాల బారిన పడి దాదాపు రూ.29.8 కోట్లను కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.