"హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి" అయోధ్య ఘటనపై విశ్వహిందూ పరిషత్ భావోద్వేగం

రామమందిర వ్యవహారంపై విశ్వహిందూ పరిషత్ తొలిసారి స్పందించింది. విరాళాల పక్కదారి వ్యవహారంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. రామజన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా వీహెచ్‌పీ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ వ్యవహరిస్తున్నప్పటికీ.. ఈ వ్యవహారంలో కేంద్రానికి గానీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్‌ఎస్‌కి గానీ ముడిపెడితే ఒప్పుకోమని చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడాలని కోరిన ఆయన.. ఆలయ బాధ్యత మాత్రం ట్రస్ట్‌కే ఉండాలని చెప్పారు.